కరోనా పరీక్షలు ఎవరెవరు చేయించుకోవాలంటే..

కరోనా పరీక్షలు ఎవరెవరు చేయించుకోవాలంటే..

తుమ్మినా, దగ్గినా కరోనా అంటుకుందేమో అని జనం భయపడుతున్న ప్రస్తుత తరుణంలో వారి అనుమానాలను పారద్రోలేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమాచార పత్రాన్ని విడుదల చేసింది.

* గత 14 రోజుల్లో విదేశీ ప్రయాణం చేసి వచ్చిన ఎవరైనా కరోనా పరీక్షలు తప్పక చేయించుకోవాలి.

* ఒకవేళ కరోనా నిర్ధారణ అయిన పక్షంలో వారితో కలిసి తిరిగిన వారు కూడా తప్పక పరీక్షలు చేయించుకోవాలి.

* డాక్టర్లు, నర్సులు, ఇతర హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షలు చేయించుకోవాలి.

* ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కూడా పరీక్షలు చేయించుకోవాలి.

* శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పక పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనాను అరికట్టగలమనే ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story