లాక్డౌన్ నేపథ్యంలో 200 కిలోమీటర్లు నడిచి డెలివరీ ఏజంట్ మృతి

లాక్డౌన్ నేపథ్యంలో 200 కిలోమీటర్లు నడిచి డెలివరీ ఏజంట్ మృతి

లాక్డౌన్ నేపథ్యంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కిలోమీటర్లు పైగా నడిచి డెలివరీ ఏజంట్ మృతి చెందాడు.. ఈ హృదయవిదారక ఘటన ఢిల్లీలోని ఆగ్రాలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన 38 ఏళ్ల రణ్‌వీర్ సింగ్ పొట్టకూటికోసం ఢిల్లీకి వచ్చాడు. అక్కడ డెలివరీ ఏజంట్ గా పనిచేస్తున్నాడు. అయితే దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా బస్సులు, రైళ్లు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీలో అతని ఆశ్రయం కరువైంది.

దాంతో చేసేది లేక తన స్వగ్రామానికి కాలినడకన బయలుదేరాడు. 200 కిలోమీటర్లు పైగా నడిచిన అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా హైవేపై కళ్ళు తిరిగి పడిపోయాడు.. స్థానిక దుకాణదారుడు గమనించి అతనికి టీ మరియు బిస్కెట్లు ఇచ్చాడు. ఆ తరువాత కూడా తన నడక ప్రారంభించిన అతను గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రమంలో రణ్‌వీర్ సింగ్‌కు గుండెపోటు వచ్చి మరణించాడు.

Tags

Read MoreRead Less
Next Story