ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంటే.. నైజీరియా మాత్రం ఉగ్రవాదులతో పోరాటం..

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుంటే.. నైజీరియా మాత్రం ఉగ్రవాదులతో పోరాటం..

ప్రపంచం అంతా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది.. కానీ నైజీరియా ప్రభుత్వం మాత్రం ఉగ్రవాదులతో పోరాటం చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం నైజీరియా సైనికులు 100 మంది బోకో హరామ్‌ ఉగ్రవాదులను ఏరివేశారు. ఇది ప్రతీకార చర్యగానే ఆ దేశం భావిస్తోంది. ఈ మేరకు ప్రతీకార దాడిలో ఉగ్రవాదులు మరణించారని అధికారులు తెలిపారు.

బోర్నో ప్రావిన్స్‌లో బోకో హరామ్‌పై జరిగిన దాడిలో ఉగ్రవాదులు మరణించారని మిలటరీ ట్రైనింగ్ అండ్ ఆపరేషన్స్ చీఫ్ ఎనోబాంగ్ ఓకాన్ ఉడోహ్ తెలిపారు. సోమవారం ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో 100 మందికి పైగా మరణించారని, 70 మంది దాకా గాయపడ్డారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story