దక్షిణ కొరియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి

దక్షిణ కొరియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి

ఆదివారం దక్షిణ కొరియా 105 కొత్త కరోనావైరస్ కేసులను నివేదించింది.. దీంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,538 కు పెరిగింది. అలాగే మరణాల సంఖ్య కూడా 152 కు పెరిగిందని కొరియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో తెలిపింది.

వాస్తవానికి కరోనా వైరస్ ప్రారంభంలో దక్షిణ కొరియాలో ప్రతిరోజూ వందలాది కొత్త అంటువ్యాధులు నమోదయ్యాయి, ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కేసులు నమోదైన రెండవ దేశంగా అవతరించింది.. ఆ తరువాత వ్యాప్తి క్రమంగా మందగించింది. కేసులు, మరణాల సంఖ్య తగ్గిపోయింది.

ఇక దక్షిణ కొరియాలోని సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో కేసులు పెరుగుతుండటంతో అక్కడ ఆందోళనలు ఉన్నాయి. దక్షిణ కొరియాలోని 51 మిలియన్ల జనాభాలో సగానికి పైగా నివసించే సియోల్ మరియు దాని చుట్టుపక్కల ఉన్న జియోంగ్గి ప్రావిన్స్‌లో 105 కొత్త కేసుల్లో 35 కేసులు నమోదయ్యాయని కొరియా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక మొత్తం 9,538 కేసులలో 5,033 కోలుకొని దిగ్బంధం నుండి విడుదలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story