భారత్ లో ఆదివారం తగ్గిన కరోనావైరస్ కేసుల సంఖ్య..

భారత్ లో ఆదివారం తగ్గిన కరోనావైరస్ కేసుల సంఖ్య..

కరోనావైరస్ సంక్రమణ విషయంలో, భారత్ లో గత రెండు రోజులలో తగ్గుదల కనిపిస్తుంది. covid19india.org వెబ్‌సైట్ ఈ గణాంకాలు ప్రకారం శుక్రవారం దేశంలో 151 కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో కరోనా వైరస్ కేసులు ఇంత ఎక్కువగా నమోదు కావడం తొలిసారి. దీని తరువాత శనివారం 143 మంది కేసులు నమోదయ్యాయి, ఇక ఆదివారం చివరి వరకు కూడా 116 మందికి మాత్రమే పాజిటివ్ నివేదికలు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే కొంత తగ్గుముఖం పెట్టిందనే విషయం అర్ధమవుతోంది. భారత్ లో ఇప్పుడు మొత్తం సోకిన వారి సంఖ్య 1142 కి చేరుకుంది. ఇందులో 31 మంది మరణించారు. ప్రస్తుతం, ప్రభుత్వ గణాంకాలలో సోకిన వారి సంఖ్య 1024 మాత్రమే.. ఎందుకంటే మొత్తం కేసుల్లో 95 మందికి నయమైంది.

మరోవైపు లాక్డౌన్ నేపథ్యంలో రోజువారీ వేతన కార్మికుల తరుపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్ట్ విచారణ జరగనుంది , ముంబై, జైపూర్, సూరత్ వంటి ప్రాంతాల నుండి రోజువారీ వేతన కార్మికులు ఆయా రాష్ట్రాలకు వెళుతున్నారు. అయితే వారిని మధ్యలోనే నిలిపివేశారు. దాంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కుటుంబాలకు ఆహారం, నీరు, బస ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి చెందిన పిటిషనర్ అలఖ్ అలోక్ శ్రీవాస్తవ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story