తారక్ తమిళ డైలాగులు.. 'ఎన్ అన్నన్.. కాటుక్కు మన్నన్'.. రచయిత ఫిదా

తారక్ తమిళ డైలాగులు.. ఎన్ అన్నన్.. కాటుక్కు మన్నన్.. రచయిత ఫిదా
X

తారక్ డైలాగ్ చెప్పాడంటే చాలు అభిమానులు ఎగ్జైట్‌మెంట్‌తో ఊగిపోతారు. తెలుగు పదాల్ని పలకడంలో.. పిచ్ పెంచడంలో తగ్గించడంలో.. ఎమోషన్స్ ను మాటల్లో సరిగ్గా క్యారీ చేయడంలో తనకు తానే సాటి అని తారక్ చాలసార్లు నిరూపించాడు. ఆర్ఆర్ఆర్‌తో ఈ విషయాన్ని తారక్ మరోసారి రుజువు చేశాడు. ఇటీవల చెర్రీ బర్త్‌డే సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో ఓ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ రిలీజ్ చేసింది. తారక్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియోలో హీరోని ఎలివేట్ చేస్తూ డైలాగ్ చెప్పిన వైనం అమోఘం.. అద్భుతం.

తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ తారక్ ఓ రేంజిలో డైలాగ్ పేల్చటం చూసి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా హిందీలో తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ గురించి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇక తమిళంలో తారక్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తారక్ డబ్బింగ్‌పై ప్రముఖ తమిళ రచయిత మదన్ కార్కి స్పందించారు. 'ఎన్ అన్నన్.. కాటుక్కు మన్నన్.. అల్లూరి సీతారామరాజు' అంటూ పొగడత్తల వర్షం కురిపించారు. ఇక తారక్ అద్భుతంగా తమిళంలో డబ్బింగ్ చెప్పారని మదన్ ప్రశంసించారు. తారక్ గాత్రం, ఉచ్ఛారణ అద్భుతంగా కుదిరాయన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో 'ఆర్ఆర్ఆర్' మల్టీస్టారర్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రౌద్రం రణం రుధిరం' మూవీ తెలుగుతోపాటు పలు భాషల్లో రూపొందుతోంది. అయితే మలయాళంలో మినహా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తన పాత్రకు తారక్ స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నాడట.

Next Story

RELATED STORIES