కరోనా ఎఫెక్ట్.. విజయవాడ కృష్ణలంకలో రెడ్ అలర్ట్

X
TV5 Telugu30 March 2020 12:42 PM GMT
కరోనా ఎఫెక్ట్ తో విజయవాడ కృష్ణలంకలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కృష్ణలంకకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితుడు మక్కాకు వెళ్లి 20 రోజుల కిందట విజయవాడకు చేరుకున్నాడు. అయితే కరోనా లక్షణాలు కనిపించడంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
పాజిటివ్ అని తేలడంతో ఆ ప్రాంతమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. కృష్ణలంకలోని 16 , 17 ,18 , 19 , 20 , 21 , 22 డివిజన్లలో పూర్తి బంద్ కొనసాగుతోంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి 9 వరకు మాత్రం నిత్యావసర కొనుగోలుకు అనుమతించారు. కాగా ఇప్పటికే ఏపీలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ప్రకాశం జిల్లా చీరాల మండలం నవాబుపేటకు చెందిన భార్యాభర్తలకు కరోనా నిర్ధారణ అయింది.
Next Story