కరోనా కట్టడికి రెండు వారాలు.. మూడు విటమిన్లు..

కరోనా కట్టడికి రెండు వారాలు.. మూడు విటమిన్లు..

ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి మంచి పని చేసింది. సామాజిక దూరాన్ని పాటించి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదే సరైన పరిష్కారమని డాక్టర్లు అంటున్నారు. ఓ రెండు వారాలు ఇలానే ఉంటే పరిస్థితి తగ్గుముఖం పడుతుంది అని ప్రభుత్వంతో పాటు డాక్టర్లూ సూచిస్తున్నారు. కరోనా వైరస్‌కు టీకా తయారు కావడానికి 12 నుంచి 16 నెలల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యమైన మూడు విటమిన్లు తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విటమిన్ డి లోపం ఉంటే వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. డి విటమిన్ లోపం ఉంటే వారానికి ఒక టాబ్లెట్ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతొ పాటు విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటూ, బీ కాంప్లెక్స్, జింక్ టాబ్లెట్లు వేసుకోవాలని చెబుతున్నారు. ఇవి వాడుతుంటే వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story