అమెరికాలో కరోనా కారణంగా 24 గంటల్లో 518 మంది మృతి

అమెరికాలో కరోనా కారణంగా 24 గంటల్లో 518 మంది మృతి

అమెరికాలో కరోనావైరస్ కారణంగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో 518 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 2400 కు చేరుకుంది. కరోనా ను ఎదుర్కోవడానికి ఆయన ఆదివారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాబోయే రెండు వారాల్లో మరణాల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుందని సమావేశంలో చెప్పారు.

అంతేకాదు ఏప్రిల్ 12 ఈస్టర్ నాటికి అమెరికాలో మరణాల సంఖ్య గరిష్టంగా ఉంటుంది అందువల్ల ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించే తేదీని కూడా ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. మరోవైపు దేశంలో 2 లక్షల మందికి వ్యాధి సోకినట్లు వైట్ హౌస్ అంచనా వేసింది. ఇక అమెరికాలో 1 లక్ష 42 వేల కరోనా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. కరోనా కట్టడి నేపథ్యంలో మంగళవారం ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story