ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకులు కనిపించవు..

ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకులు కనిపించవు..
X

బ్యాంకుల విలీనం ప్రక్రియకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అవుతున్నాయి. అలాగే సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం అవుతోంది. అదే విధంగా ఆంద్రా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అవుతున్నాయి. అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌లో విలీనం అవుతున్నది. ఈ విలీనం ప్రక్రియ పూర్తయితే ఎస్బీఐ తరువాత అతి పెద్ద బ్యాంక్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవతరిస్తుంది. ఇకనుండి ఆంద్రా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్‌‌లు కనిపించవు.

Tags

Next Story