Top

12 వేల నకిలీ ఎన్95 మాస్క్‌లు

12 వేల నకిలీ ఎన్95 మాస్క్‌లు
X

ఎదుటివారి అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు అక్రమార్కులు తెగబడిపోతున్నారు. భారత్ లో కరోనా మహమ్మరి కారణంగా మాస్క్‌లు, శానిటైజర్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమదందాకు తెరలేపారు. సాధారణ క్లాత్‌తో మాస్క్‌లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

నకిలీ మాస్క్‌లను ఎన్95 మాస్క్‌లు అంటూ అధిక ధరకు అమ్ముతున్నారని ఫిర్యాదులు అందడంతో బెంగళూరు సెంట్రల్ క్రైంబ్రాంచి పోలీసులు రంగంలోకి దిగారు. గోడౌన్‌పై మెరుపుదాడి చేసి ఎన్95 రకానికి చెందిన 12 వేల నకిలీ మాస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES