అప్పుడే చెప్పాడు.. అదే అక్షరాలా ఇప్పుడు..

కరోనా వచ్చిందని ఇప్పుడు కంగారు పడుతున్నాం కానీ 14 ఏళ్ల అభిగ్య ఆగస్ట్‌లోనే చెప్పేసాడు. గ్రహస్థితులను అనుసరించి ఒక భయంకరమైన వింత వ్యాది రాబోతోందని ముందే హెచ్చరించాడు. అభిగ్య చిన్న వయసులోనే శాస్త్రాలన్నీ ఔపోసన పట్టాడు. జ్యోతీష్యం, వాస్తు శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశాడు. విశ్వమ్ అనే పోర్టల్ నిర్వహిస్తున్నాడు.
అభిగ్య ఆనంద్ తండ్రి ఆనంద్ రామసుబ్రమణియన్, తల్లి అన్ను ఆనంద్. గుజరాత్‌లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా కొనసాగుతున్న అభిగ్య ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో పీహెచ్‌డీ చేశాడు. నవంబరు 2019 నుంచి 2020 మే వరకు ప్రపంచం విపత్కర పరిస్థితిని ఎదుర్కుంటుందని తన యూట్యూబ్ చానెల్‌లో వివరించాడు. చైనా యుద్ధ పరిస్థితిని ఎదుర్కుంటుందని, ధనిక దేశాలన్నీ అతలాకుతలం అవుతాయని చెప్పాడు. వాస్తు, జ్యోతిష్యం ఇవన్నీ ఉత్త ట్రాష్ అని కొట్టేపారేసేవారు కూడా ఈ వీడియో చూస్తే నిజమేనేమో అని నమ్మక తప్పని పరిస్థితి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com