Top

భారత్ లో పెరిగిన కరోనా కేసులు..

భారత్ లో పెరిగిన కరోనా కేసులు..
X

భారతదేశం మంగళవారం 30 కి పైగా తాజా కేసులు నమోదు కావడంతో కరోనావైరస్ కేసుల సంఖ్య 1,251 కి చేరుకుంది. అలాగే కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య 40 కి చేరుకుంది. అయితే ఇందులో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య తీసేస్తే.. కేసుల సంఖ్య 1,120 గా ఉంది, మొత్తం 101 మంది డిశ్చార్జ్ అవ్వగా మరికొంతమంది కోలుకొని ఆసుపత్రులలోనే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధిక మరణాలు (10), తరువాత గుజరాత్ (6), తెలంగాణ(6), కర్ణాటక (3) మధ్యప్రదేశ్ (3), ఢిల్లీ(2), జమ్మూ కాశ్మీర్ (2) ఉన్నాయి. తమిళనాడు, బీహార్, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్కరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. తిరువనంతపురంలో 68 ఏళ్ల మరణించిన తరువాత మంగళవారం కేరళలో రెండో మరణం సంభవించింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలోని ఓ ఆసుపత్రిలో కరోనావైరస్ సోకిన ఒక మహిళ మరణించింది, దీంతో అక్కడ మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరుకుంది.

ఇక కేరళలో ఇప్పటివరకు 234 కేసులు గుర్తించారు. అలాగే మహారాష్ట్ర మంగళవారం 10 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 230 గా నమోదయ్యాయి. ఢిల్లీలో కేసుల సంఖ్య 97 కి పెరిగింది. కర్ణాటకలో కేసులు ఇప్పటివరకు 91 కి పెరిగాయి, ఉత్తరప్రదేశ్‌లో 96 , తెలంగాణలో 77, గుజరాత్‌లో 70, తమిళనాడులో 67 నమోదయ్యాయి. రాజస్థాన్‌లో కేసుల సంఖ్య 79 కి పెరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో కేసుల సంఖ్య 49 కి పెరిగింది. మధ్యప్రదేశ్‌లో 47 , పంజాబ్‌లో 41 కేసులు, హర్యానాలో 36 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి . ఆంధ్రప్రదేశ్ లో 40 , పశ్చిమ బెంగాల్ 22, బీహార్ 15, లడఖ్ 13 , అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో 10 కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES