తాజా వార్తలు

కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్

కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్
X

కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో హుటాహుటిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో తిరిగిన వాళ్లలో పాజిటివ్ లక్షణాలు గుర్తించారు. గతంలో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్తగా అతని కుటుంబంలో మిగతా ఏడుగురికి కూడా పరీక్షలు చేశారు. వీరిలో ఇద్దరికి కరోనా సోకినట్లు గుర్తించారు.

బాధితుడి తల్లికి, సోదరిలో లక్షణాలు కనిపించడంతో వెంటనే వారిని హైదరాబాద్ పంపిస్తున్నట్టు కరీంనగర్ కలెక్టర్ చెప్పారు. అంతేకాదు ఆ కుటుంబంలోని ఏడుగురిని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారికి కూడా వైద్య పరీక్షలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు , నిజామాబాద్ లో ఒకరు, గద్వాల్ ఒకరు మరణించినట్లు తెలిపింది.

Next Story

RELATED STORIES