కోవిడ్ -19 కు కేరళలో మరో వ్యక్తి బలి

కోవిడ్ -19 కు కేరళలో మరో వ్యక్తి బలి
X

కేరళలో కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించిన 68 ఏళ్ల వ్యక్తి మంగళవారం ఉదయం కన్నుమూశారు, ఈ వ్యాధి కారణంగా కేరళలో మరణించిన వారి సంఖ్య రెండుగా ఉంది. ఈ వ్యక్తి గత ఐదు రోజులుగా వెంటిలేటర్‌లో ఉన్నాడు. దీనిపై తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. 'కరోనావైరస్ కు పాజిటివ్ గా పరీక్షించిన వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అతను కొంతకాలంగా కిడ్నీ వైఫల్యంతోనూ బాధపడ్డాడు.

సోమవారం రాత్రి నుంచే అతని ఆరోగ్యం విషమించింది. ఈ క్రమంలో తెల్లవారుజామున మరణించారు' అని చెప్పారు. కాగా సోమవారం సాయంత్రం నాటికి కేరళలో ధృవీకరించబడిన కేసులు 202 కు చేరుకున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కన్నా అత్యధికంగా COVID-19 రోగులు ఇక్కడే ఉన్నారు. మరోవైపు భారతదేశంలో 1,200 కి పైగా వ్యాధి కేసులు నమోదయ్యాయి, సోమవారం సాయంత్రం నాటికి 1,100 మార్కును రీచ్ అయింది.

Next Story

RELATED STORIES