మందుబాబులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

మందుబాబులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌
X

ఒకవైపేమో రోజురోజుకు కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి. మరో క్రమంలో మద్యం దొరక్క మందుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో ప్రస్తుతం పరిస్థితి ఇది. మద్యం దొరక్కపోవడంతో కొంతమంది వ్యక్తి విత్ డ్రాల్ లక్షణాలతో బాధపడుతున్నారు. దీనితో ఇటీవల ఓ వ్యక్తి కూడా మరణించారు. దాంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం విక్రయాలకు కేరళ ముఖ్యమంత్రి ఒకే చెప్పారు.

అయితే మద్యం కావాల్సిన వాళ్లు వైద్యుడి దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ లెటర్‌ తీసుకు వచ్చిన మారికి మాత్రమే మద్యం విక్రయిస్తామని షరతు విధించింది. ఈ క్రమంలో వీలైతే ఆన్ లైన్ ద్వారా ఇంటికే మద్యం అందించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. కాగా దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాలను మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మద్యం దొరక్క సోమవారం ఒక్కరోజే కేరళలో తొమ్మిదిమంది మరణించారు. వీరిలో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడగా.. ఇద్దరు గుండెపోటుతో మృతిచెందారు.

Tags

Next Story