యువకుడు ఏటీఎంకి వెళ్లి ఏం దొంగతనం చేశాడంటే?

యువకుడు ఏటీఎంకి వెళ్లి ఏం దొంగతనం చేశాడంటే?
X

ఏటీఎంలోకి వచ్చి డబ్బులు దొంగతనం చేసిన వాళ్ల గురించి చదివి ఉంటారు కానీ.. ఓ యువకుడు ఏటీఎం వద్ద చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. కరోనా మహమ్మరి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్కులు, శానిటైజర్లకు ఉపయోగిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాల మంది.. అధిక ధరలు ఉన్నప్పటికీ శానిటైజర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి సింపుల్‌గా ఏటీఎం సెంటర్‌లో ఉంచిన శానిటైజర్ బాటిల్‌నే ఎత్తుకెళ్లాడు.

ఓ యవకుడు డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత.. అక్కడున్న శానిటైజర్‌ను గమనించాడు. మార్కెట్లో శానిటైజర్‌ దొరకకపోవడంతో.. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు దాన్ని చొక్కాలో దాచుకుని వెళ్లిపోయాడు. ఈ వీడియోను పాకిస్తాన్‌కు చెందిన నైలా ఇనయాత్‌ అనే జర్నలిస్టు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Next Story

RELATED STORIES