పెరిగిన కూలీల వేతనం

పెరిగిన కూలీల వేతనం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పనుల పై మహమ్మారి కరోనా ఎఫెక్ట్‌ పడింది. మార్చి వచ్చిందింటే చాలు కూలీలతో గ్రామీణా ప్రాం తాలలో పెద్ద ఎత్తున పనులు జరిగేవి. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పనులే ఆసరాగా ఉంటున్నాయి. అయితే ఈసారి ఆ పరిస్థతులు కని పించడం లేదు.

ఉపాధి పనికి వచ్చే వారిపై కరోనా ఎఫెక్ట్‌ ప్రభావం చూపుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూలీల వేతనాలను పెంచింది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి హామీ కూలీల వేతనాలను ఒక్కొక్కరికి రూ.20 పెంచుతూ కేంద్రం ఉత్వర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాన్ని ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద అందిస్తామంది. ఉపాధి కూలీలకు ఇప్పటి దాకా రోజు వేతనం రూ.210.37 ఇచ్చేవారు. ఆ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.237 పెంచింది. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన వేతనం వర్తించనుంది.

Tags

Read MoreRead Less
Next Story