కరోనా వచ్చిన గంటలోనే..

X
TV5 Telugu31 March 2020 5:26 PM GMT
కరోనా అనుమానితుల్ని క్వారంటైన్లోకి పంపిస్తున్నారు. అయితే వైరస్ సోకిందీ లేనిది 14 రోజుల తరువాతే గుర్తించగలుగుతున్నారు. కానీ ఈ వైరస్ వచ్చిన వారు గంట తరువాత రుచిని కోల్పోవడం, వాసన తెలియక పోవడం జరుగుతుందని, ఆ లక్షణాలను గుర్తించగలిగితే వైరస్ సోకినట్లు తెలుసుకోవచ్చని అంటున్నారు. ఈ వైరస్ ముక్కు ద్వారా, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎక్కువ సేపు నాసికా రంధ్రాలలోనే ఉండిపోతుంది. ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించడం తక్షణ కర్తవ్యం.
Next Story