శ్రీవారి దర్శన భాగ్యం ఏప్రిల్ 14 తరువాతే..

శ్రీవారి దర్శన భాగ్యం ఏప్రిల్ 14 తరువాతే..

లాక్‌డౌన్‌తో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని నిలిపివేశారు. సామాజిక దూరాన్ని పాటించే నిమిత్తం ఏపిల్ర్ 14 వరకు గుడిలోకి భక్తులెవరినీ అనుమతించడం లేదని టీటీడీ పేర్కొంది. స్వామి వారి నిత్య కైంకర్యాలు మాత్రం నిర్వహిస్తున్నారు. స్వామి వారిని దర్శించే రెండు రహదారులను దేవస్థాన అధికారులు మూసివేశారు. సిబ్బంది మాత్రం షిప్ట్‌లలో పని చేస్తున్నారు. అన్నదాన సత్రం కూడా మూసి వేయడంతో పేదవారు ఇబ్బంది పడతారని భావించిన దేవస్థాన అధికారులు 50 వేల మంది వివిధ కూడళ్లలో ఆహార పొట్లాట పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ 2న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించాల్సిన శ్రీవారి హనుమంత సేవను కూడా తితిదే రద్దు చేసింది. స్వామివారి వార్షిక వసంతోత్సవాలను కళ్యాణ మండపంలో ఏకాంతంగా నిర్ణయించ తలపెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story