హీత్రూ విమానాశ్రయంలో నరకం చూస్తున్న తెలుగు విద్యార్థులు

బ్రిటన్ లోని హీత్రూ విమానాశ్రయంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నరకం చూస్తున్నారు. పది రోజుల క్రితం ఇండియా వచ్చేందుకు హీత్రూ విమానాశ్రయానికి వచ్చిన విద్యార్థులు అప్పటినుంచి అక్కడే చిక్కుకుపోయారు. విమాన సర్వీసులు లేక ఏపీ, తెలంగాణ, హుజారాత్ కు చెందిన విద్యార్థులు దాదాపు 250 మంది అక్కడే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి నాలుగు రోజులు వసతి , ఆహరం ఇండియన్ ఎంబసీ అధికారులు అందించినా ఆ తరువాత నుంచి ఫుడ్ లేక అల్లాడిపోతున్నారు.
వెనక్కి వెళ్లే అవకాశం లేక అలాగని ఇండియా వచ్చే మార్గం లేక రేపన్న రోజున ఏమౌతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. తమకు ఏదో ఒక చోట కనీసం షెల్టర్ ఇప్పించాలని నడిరోడ్డుపై ఉన్న తమను ఆదుకోవాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. మరోవైపు కరోనా విలయంతో యూకేలో గంటగంటకు మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 22 వేలకు పెరిగితే మరణాల సంఖ్య 14 వందలకు పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com