Top

అమ్మా..మీకు వందనం.. మిమ్మల్ని చూసి మేం కూడా..

అమ్మా..మీకు వందనం.. మిమ్మల్ని చూసి మేం కూడా..
X

తన 82 ఏండ్ల జీవిత కాలంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూసి ఉండరు. అందుకే తన వంతుగా కరోనా బాధితులకు ఏదో ఒక సాయం చేయాలనుకున్నారు. తనకు వచ్చే పెన్షన్ డబ్బుల్లోనుంచే దాచుకున్న లక్షరూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. మానవత్వం ఉన్న మంచి మనిషి అనిపించుకున్నారు మధ్యప్రదేశ్‌కు విదిశ జిల్లాలోని అరిహంత్ విహార్‌కు చెందిన సల్బా ఉస్కర్. ఆమె ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. పెన్షన్ డబ్బుతో తన జీవితాన్ని గడుపుతున్నారు. వచ్చే దాంట్లోనే కొంత దాచుకుంటున్నారు అత్యవసర అవసరాల కోసం. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపు విన్న సల్బా తన వంతు సాయాన్ని అందించారు. ఆమె ఉదార మనస్తత్వానికి సీఎం ఫిదా అయ్యారు. మా తుజే సలాం (అమ్మానీకు వందనం) అని ఆమెను ప్రశంసిస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.

Next Story

RELATED STORIES