మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ

మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ

ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ పేరు చెబితేనే ఇప్పుడు దేశం మొత్తం వణికిపోతోంది. దేశంలో కరోనా వ్యాప్తి పెరగడానికి ఈ ప్రాంతం కేర్ ఆఫ్ గా మారింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి కొన్ని వేలమంది ఢిల్లీకి వెళ్లారు. ప్రార్ధనలు జరిగిన నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనానికి వెళ్లిన వాళ్లలో చాలా మంది కరోనా భారిన పడ్డారు. ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోపాటు ఆ భవనంలో ఉన్న ఆ భవనంలో ఉన్న వారందరికీ వైరస్ సోకినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మర్కజ్ ఘటనపై కేంద్ర హోమ్ శాఖ వివరాలు సేకరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో ముస్లింలు పాల్గొన్నట్టు కేంద్ర హోమ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ , నేపాల్ , మయన్మార్, బాంగ్లాదేశ్ , శ్రీలంక , కజకిస్థాన్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు గుర్తించారు.

విదేశాల నుంచి వచ్చిన వారు ముర్ఖజ్ భవనంలో రిపోర్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళతారని వీరు వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కోఆర్డినేటర్ల ద్వారా జిల్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని కేంద్ర హోమ్ శాఖ వివరాలు సేకరించింది. మార్చి 21 నాటికి ముర్ఖజ్ భవనంలో 1746 మంది ఉన్నట్లు గుర్తించింది. వారిలో 1530 మంది మనదేశానికి చెందిన వారు కాగా 216 మంది విదేశీయులు ఉన్నట్టు గుర్తించారు. అప్పటికి దేశవ్యాప్తంగా 824 ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరాలు సేకరించారు. వీరందరిని క్వారంటైన్ చేసి స్క్రీనింగ్ కు పంపాలని రాష్ట్రాల పోలీసులకు కేంద్ర హోమ్ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. వీరితోపాటు భారత తబ్లీజ్ జమాత్ కార్యకర్తలు జిల్లా కోఆర్డినేటర్లను కూడా స్క్రీనింగ్ చెయ్యాలని పోలీసులను ఆదేశించారు హోమ్ శాఖ అధికారులు.

ఇప్పటివరకు 2137 మంది తబ్లీజ్ జమాత్ కార్యకర్తలకుపరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు క్వారంటైన్ కు తరలించినట్టు హోమ్ శాఖ పేర్కొంది. దీంతో పాటు వారంతా తిరిగిన ప్రాంతాలు ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలని ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోమ్ శాఖ వెల్లడించింది. మర్కజ్ భవనంలో మార్చి 26 నుంచి తబ్లీజ్ జమాత్ కార్యకర్తలను స్క్రీనింగ్ చేస్తున్నామని 12 వందల మందిని స్క్రీనింగ్ చెయ్యగా 303 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించామని హోమ్ శాఖ అధికారులు తెలిపారు. వీరందరిని ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story