జమ్మూకశ్మీర్‌లో వారే స్థానికులు: కేంద్రం ఉత్తర్వులు

జమ్మూకశ్మీర్‌లో వారే స్థానికులు: కేంద్రం ఉత్తర్వులు

కశ్మీర్‌లోని స్థానికత నిబంధనలతో పాటు ఉద్యోగ అర్హతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సరికొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఇకపై ఈ మార్గదర్శకాల కిందికి వచ్చే వారినే స్థానిక ఉద్యోగాలకు గుర్తిస్తామని కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

జమ్మూకశ్మీర్‌లో వరుసగా 15 సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలని, లేదా ఏడు ఏళ్ళు జమ్మూకశ్మీర్‌లోనే చదవటంతో పాటు.. టెన్త్, ఇంటర్ అక్కడే చదువుకున్న వారిని స్థిర నివాసులుగా పరిగణించబడతారు. అయితే ఈ నిబంధనలు 25,500 రూపాయల ప్రాథమిక వేతనం ఉన్న అన్ని పోస్టుల నియామకాలకూ ఈ నివాస నియమం వర్తిస్తుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, స్వయం ప్రతిపత్తి గల కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, సెంట్రల్ యూనివర్శిటీల అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పరిశోధనా సంస్థల తరపున జమ్మూ కశ్మీర్‌లో దాదాపు పది సంవత్సరాలు పనిచేసే వారందర్నీ ఇకపై స్థానికులుగా గుర్తించనున్నట్టు తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఎవరైనా బయట నుంచి వచ్చి జమ్మూ కశ్మీర్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని.. ఉద్యోగాలు పొందుతారనే భయం స్థానిక నేతల్లో, ప్రజల్లో ఉంది. దీని వలన స్థానిక ప్రజలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఆందోళన చెందుతున్న టైంలో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు కాస్త ఊరటనిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story