దేశవ్యాప్తంగా 10 వైరస్ హాట్‌ స్పాట్స్‌ ల గుర్తింపు

దేశవ్యాప్తంగా 10 వైరస్ హాట్‌ స్పాట్స్‌ ల గుర్తింపు

వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా 10 వైరస్ హాట్‌ స్పాట్స్‌ ను గుర్తించారు. 10 కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌ స్పాట్ లుగా గుర్తించారు. వీటిలో ఢిల్లీ లోని దిల్షాద్ గార్డెన్ మరియు నిజాముద్దీన్, నోయిడా, మీరట్, భిల్వారా, అహ్మదాబాద్, కాసర్గోడ్, పతనమిట్ట, ముంబై మరియు పూణే లు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి గుర్తించిన హాట్‌స్పాట్లలో వైరస్ పరీక్షలను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ బారిన పడ్డవారు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు, ఈ హాట్‌స్పాట్స్‌ను దిగ్బంధించాలని ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ మంగళవారం తెలిపారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్ పై ప్రత్యేక ద్రుష్టి సారించారు అధికారులు. ఈ ప్రాంతాన్ని హాట్‌ స్పాట్ గా గుర్తించి అక్కడ ఎవ్వరిని తిరగనీయకుండా నిర్బంధం విధించింది. ఇక్కడ జరిగిన మాత పరమైన కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. వీరిలో 303 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. మంగళావారం ఒక్కరోజే 238 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13 వందలు దాటింది. మహారాష్ట్ర, కేరళలోనే 500 కు పైగా నమోదయ్యాయి. వైరస్ కారణంగా 42 మంది ప్రాణాలు కోల్పోగా.. 140 మంది దాకా కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story