తెలంగాణలో కరోనా వ్యాప్తి కలకలం.. 97కు చేరిన కేసులు..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కలకలం.. 97కు చేరిన కేసులు..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. తగ్గినట్టే తగ్గిన కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ కేసులతో అంతకంతకు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే మరో 15 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 97 కు చేరింది. కొత్తగా నమోదైన కేసులు ఢిల్లీలోని మర్కజ్ నుంచి వచ్చే వారే కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ మర్కజ్ మాత ప్రార్ధనలకోసం వెళ్లిన వారెందరూ? వారు ఎవరెవర్ని కలిశారు? ఎక్కడెక్కడ సంచరించారు? అన్నది ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇప్పటికే రాష్ట్రంనుంచి 1031 మంది ఢిల్లీ మాత ప్రార్ధనలకోసం వెళ్లినట్టు ప్రాధమికంగా నిర్ధారించింది.

కేవలం గ్రేటర్ హైదరాబాద్ నుంచే 600 కు పైగా ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నారు అధికారులు. అందరిపైనా నిఘా పెట్టారు. వీరివల్ల కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉండటంతో ఇప్పటివరకు గుర్తించిన వారి తోపాటు వారి కుటుంబసభ్యుల్ని అందర్నీ ఐసోలేషన్ కు తరలించారు. వీరికోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. మరికొంతమంది ఆచూకీ లేకపోవడంతో వారిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వారు గాంధీ ఆసుపత్రిలో ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు వారి బంధువులు కూడా స్వచ్చందంగా ఆసుపత్రికి రావాలని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story