నాన్నా.. నేను నిన్ను వెళ్లనివ్వను.. వీడియో వైరల్

నాన్నా.. నేను నిన్ను వెళ్లనివ్వను.. వీడియో వైరల్
X

మాకైతే అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని చెబుతారు. మరి మన ప్రధాని బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు కదా మీరు మాత్రం ఎందుకు వినరు. ఎందుకు బయటకు వెళుతున్నావు. నేను నిన్ను వెళ్లనివ్వను అని ఓ చిన్నారి నాన్న బయటకు వెళుతుంటే అడ్డుపడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నారి వాళ్ల నాన్నతో పలికిన ముద్దు ముద్దు మాటలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ‌కి తెగ నచ్చేశాయి. ఓ చిన్నారికి కూడా లాక్‌డౌన్ ఆవశ్యకత అర్ధమైందని ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రధాని మోడీ విజ్ఞప్తిని తండ్రికి గుర్తు చేసింది అని ఆ చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

RELATED STORIES