కరోనా.. మే హూనా.. విధుల్లో ఉన్న వారు మరణిస్తే కోటి

కరోనా.. మే హూనా.. విధుల్లో ఉన్న వారు మరణిస్తే కోటి
X

దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ కరోనా బాధితులకు సేవలందిస్తున్న సిబ్బందికి ఊరటనిచ్చే వ్యాఖ్యలు చేశారు. బాధితులకు వైద్యం అందించేందుకు డాక్టర్లు, నర్సులు, శానిటైజేషన్ వర్కర్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటి వారు విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోతే తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆ కుటుంబాలకు కోటి రూపాయలు అందజేస్తామని కేజ్రీ ప్రకటించారు. ప్రభుత్వ లేదా ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. కాగా, డిల్లీలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121కి చేరింది. ఇందులో ఇద్దరు మృతి చెందారు. మర్కజ్ భవనంలో ఉన్న వారిలో 617 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా తెలిపారు.

Next Story

RELATED STORIES