కరోనా వైరస్ కారణంగా ప్రఖ్యాత భారత సంతతి వైరాలజిస్ట్ మృతి

కరోనా వైరస్ కారణంగా ప్రఖ్యాత భారత సంతతి వైరాలజిస్ట్ మృతి
X

దక్షణఫ్రికాలో కరోనా వైరస్ కు ప్రఖ్యాత భారత సంతతి వైరాలజిస్ట్ బలైంది. దక్షణఫ్రికాలో కరోనా వైరస్ కారణంగా భారతీయ సంతతికి చెందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ గీతా రామ్‌జీ మృతి చెందారు. ఆమె వయసు 64 ఏళ్ళు. హెచ్ఐవి నివారణ పరిశోధనలో కీలకంగా ఆమె వ్యవహరిస్తున్నారు. ఆమె వారంరోజుల కిందట లండన్ నుండి దక్షణఫ్రికాకు తిరిగి వచ్చారు, COVID-19 పరీక్షలు చేశారు నెగెటివ్ అని వచ్చింది. పైగా లక్షణాలు కూడా కనిపించలేదు. అయితే ఈ క్రమంలో గతమూడు రోజుల కిందట ఆమెకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

దాంతో ఆమెను ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించి మృతి చెందారు. "ఈ రోజు ఆసుపత్రిలో ప్రొఫెసర్ గీతా రాంజీ విషాదకర విషయాన్ని మీకు తెలియజేయడం మాకు చాలా బాధగా ఉంది" అని SAMRC అధ్యక్షుడు, CEO గ్లెండా గ్రే విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్ రాంజీ COVID-19 సంబంధిత సమస్యలతో మరణించారు అని గ్రే తెలిపారు.

Next Story

RELATED STORIES