Top

వాళ్లిద్దరూ మా ఇంటికి వచ్చారు.. అయినా నో చెప్పా..

వాళ్లిద్దరూ మా ఇంటికి వచ్చారు.. అయినా నో చెప్పా..
X

స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. ఏ చిన్న పాత్ర వచ్చినా వెనకా ముందూ ఆలోచించకుండా చేయడానికి సిద్ధపడిపోతారు. ఆఖరికి ఐటెం సాంగ్ అయినా చేసేస్తున్నారు ఇప్పటి హీరోయిన్లు.. కానీ కంగనా సంథింగ్ స్పెషల్. ఆ పాత్రలో స్టఫ్ లేకపోతే నేనెందుకు చేయాలి. అతను స్టార్ హీరో అయితే నాకేంటి.. బాలీవుడ్ కండల వీరుడైతే నాకేంటి.. నాకు పొగరనుకున్నా సరే నాకు నచ్చని పని నేను చేయను అని హీరోయిన్ కంగనా రనౌత్ పింక్‌విల్లాతో పంచుకున్నారు.

బాలీవుడ్ రికార్డులను షేక్ చేసిన 'సంజు' సినిమాలో నటించమని రణ్‌బీర్ మా ఇంటికి వచ్చి మరీ అడిగాడు. అందులో హీరోయిన్ పాత్రకు అంత ప్రాముఖ్యత ఉన్నట్లు కనిపించలేదు. దాంతో ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాను. అలాగ్ సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్‌' సినిమా కోసం ఆదిత్య చోప్రా మొదట నన్ను కలిశారు. కానీ నేను కుదరదన్నాను. దాంతో ఆయనకు కోపం వచ్చి ఇక ఎప్పటికీ నాతో కలిసి పని చేయనని చెప్పారు. అయినా నేనేం బాధ పడలేదు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అవే నన్ను ఈ రోజు నాకు ఒక గౌవరవాన్ని ఇస్తున్నాయి అని కంగన చెప్పుకొచ్చారు.

Next Story

RELATED STORIES