లాక్ డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

లాక్ డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధిక మంత్రి అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్ల తోపాటు ప్రభుత్వ అధికారుల జీతాల్లో 60% వరకు తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా ఎన్నికైన ప్రతినిధులకు 60% తగ్గింపుతో మార్చిలో జీతాలు లభిస్తాయని.. ఎ, బి గ్రేడ్ ప్రభుత్వ ఉద్యోగులకు 50% తగ్గింపు, సి గ్రేడ్ ఉద్యోగులకు 25% కోతతో జీతాలు లభిస్తాయని. డి గ్రేడ్ ఉద్యోగుల జీతాలలో కోత ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story