ఛీ.. మీ వల్లే మాక్కూడా..

ఛీ.. మీ వల్లే మాక్కూడా..

కరోనా మనషుల్ని ఒక్కటే ఇబ్బంది పెడుతుందనుకుంటే పొరపాటు.. పెంపుడు జంతువుల్ని కూడా బలితీసుకుంటోంది. హాంకాంగ్‌లో ఇప్పటికే రెండు పెంపుడు కుక్కలకు కరోనా పాజిటివ్ రాగా.. తాజాగా ఓ పిల్లికి కూడా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. పిల్లిని పెంచుకుంటున్న ఓనర్‌కి కరోనా వచ్చింది. ఇంకేముంది పాపం పిల్లికి కూడా వచ్చేసింది. ఈ విషయాన్ని హాంకాంగ్ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ అండ్ కన్జర్వేషన్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించింది. అయితే జంతువుల వల్ల మనషులకు ఈ వైరస్ సోకదని.. మనుషుల వల్లే వాటికి వస్తుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. పెట్స్‌ని పెంచుకునే యజమానులెవరు భయపడాల్సిన పనిలేదని అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా అంగీకరించింది. వైరస్ పిల్లులను, కుక్కలను కూడా 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story