బావుందమ్మా వరస.. పాప పేరు కరోనా.. బాబు పేరు లాక్‌డౌన్

బావుందమ్మా వరస.. పాప పేరు కరోనా.. బాబు పేరు లాక్‌డౌన్

పగలు, రాత్రి అదే టాపిక్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అదే ముచ్చట. కరోనా, లాక్‌డౌన్. మరి ఈ టైమ్‌లో పుట్టిన మా బుజ్జాయిలకి ఆపేర్లే పెట్టేస్తే పోలా అని.. ఒకరికి కరోనా అని మరొకరికి లాక్‌డౌన్ పేర్లు పెట్టేసి ముచ్చట తీర్చుకున్నారు ఆ జంటలు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రయత్నాన్ని అభినంధిస్తూ తమ బిడ్డకు లాక్‌డౌన్ అని పేరు పెట్టినట్లు పవన్ తెలియజేశారు.

ఉత్తర ప్రదేశ్ డియోరియా జిల్లాకు చెందిన పవన్ తన భార్య ఇదే సమయంలో డెలివరీ అవడంతో ఈ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 14 వరకు బంధువుల రాకపోకలకు అనుమతి లేనందున ఎటువంటి వేడుకలు జరపకుండా తమ బిడ్డకు పేరు పెట్టామని చెప్పారు.

ఇక ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గత వారం గోరఖ్‌పూర్‌ సోహగురా గ్రామానికి చెందిన ఓ మహిళకు పుట్టిన బిడ్డకు మేనమామ కరోనా అని పేరు పెట్టారు.. వైరస్‌కి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేసినందున అప్పుడే పుట్టిన పాపాయికి కరోనా అని పెట్టాలని నిర్ణయించుకున్నట్లు మామ నితేష్ త్రిపాఠి తెలిపారు. ఈ వైరస్ ప్రపంచంలోని చాలా మంది ప్రాణాలను బలిగొంటోంది. కానీ మనకు చాలా మంచి అలవాట్లను నేర్పించింది. ప్రపంచాన్ని దగ్గర చేసింది. ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఉంటుందని మా చిన్నారికి కరోనా అని పేరు పెట్టినట్లు త్రిపాఠి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story