ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే అక్కడ మాత్రం ఎన్నికలంట..!

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతుంటే ఆ దేశంలో మాత్రం ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు పట్టుబడుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మే నెలలో పోలాండ్ అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మెజారిటీ ప్రజలు కరోనా మహమ్మారి దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారు. కానీ ఆపద్ధర్మ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా మాత్రం ఎన్నికలు జరిపితీరతామని చెబుతున్నారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కాకుండా ఇతర యూరోపియన్ దేశాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని ప్రభుత్వం చేబుతోంది.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఒక దుకాణానికి వెళ్ళడానికి ప్రజలకు ఏ విధమైన షరతులు వుంటాయో, అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళడానికి కూడా షరతులు ఉన్నాయి" అని అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా అన్నారు. మరోవైపు 77 శాతం మంది ఓటర్లు ఎన్నికలను సంవత్సరం పాటు వాయిదా వేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ పిటిషన్‌లో 270,000 సంతకాలు కూడా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com