మద్యం బాటిల్ రేటు డబుల్.. త్రిబుల్.. ఫ్రీ డోర్ డెలివరీ

మద్యం బాటిల్ రేటు డబుల్.. త్రిబుల్.. ఫ్రీ డోర్ డెలివరీ

బాటిల్ ధర భయపెట్టినా మందులేందే ముద్ద దిగదే. లాక్డౌన్ అని వైన్ షాపులు కూడా క్లోజ్ చేస్తే ఎలా.. సుక్క పడందే సక్కగ నిద్రే రాదే అని మందు బాబులు ఫోన్ చేసి మరి మద్యం తెప్పించుకుంటున్నారు. మద్యం వ్యాపారులు కూడా ఇదేదో బాగానే వుందని శుభ్రంగా బాటిల్ ధరలను భారీగా పెంచేశారు. తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మద్యం బాటిళ్లను గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు వ్యాపారులు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని మరీ పని కానిస్తున్నారు.

రోజూ తాగే వారు ఒక్కసారిగా మానేయ్యాలంటే ఎంత కష్టం. తాగకపోతే ఆరోగ్య పరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంత రేటైనా ఫరవాలేదని డోర్ డెలివరీ చేయించుకుంటున్నారు. నిజానికి పలు ప్రాంతాల్లో రూ.1,700లకు లభించే విస్కీ ఇప్పుడు రూ.4,500లకు అమ్ముతున్నారు. అలాగే రూ.600లకు దొరికే రాయల్ స్టాగ్ ఇప్పుడు రూ.3,500లకు, బ్లెండర్ స్పైడ్ రూ1,000 ఉంటే దాన్ని రూ.2,000లకు అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల దీని ధర రూ.4,000 కూడా అమ్మేస్తున్నారు. ఇక బీర్ బాటిల్ రూ.100 ఉంటే రూ.400లకు, చీప్ లిక్కర్ రూ.50 ఉన్నదాన్ని రూ.300లకు అమ్మి వ్యాపారస్తులు పండగ చేసుకుంటున్నారు. స్టాక్ అయిపోతే పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించి మరీ పెట్టుకుంటున్నారు వ్యాపారస్తులు. పోలీసుల కళ్లుగప్పి వ్యాపారస్తులు లాక్డౌన్‌ని సొమ్ము చేసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story