పరారీలో నిజాముద్దీన్ మార్కాజ్ చీఫ్ మౌలానా సాద్

పరారీలో నిజాముద్దీన్ మార్కాజ్ చీఫ్ మౌలానా సాద్
X

ఢిల్లీలో నిజాముద్దీన్ మార్కాజ్ చీఫ్ మౌలానా సాద్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు వివిధ బృందాలను ఏర్పాటు చేశారు. మహ్మద్ సాద్ ను కనిపెట్టడానికి రెండు టీమ్ లు పశ్చిమ యుపిలో ఉన్నాయని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి, అతని ఆచూకీ తెలుసుకోవడానికి అతని దగ్గరి బంధువులను పోలీసులు ప్రశ్నించారు.

అంతేకాదు అతని బంధువుల నివాసాలను కూడా శోధించారు. క్రైమ్ బ్రాంచ్ యొక్క మరొక బృందం సాద్ కోసం వివిధ మసీదులు అలాగే కొన్ని ప్రదేశాలలో వెతుకుతోంది. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌లను ట్రేస్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇటీవలి ఆడియో క్లిప్‌లో, సాద్ తాను ఒంటరిగా ఉన్నానని చెప్పాడు.

Next Story

RELATED STORIES