ఉపాధి హామీ కార్మికులకు ముందస్తు వేతనాలు అందజేయాలి: సోనియా గాంధీ

ఉపాధి హామీ కార్మికులకు ముందస్తు వేతనాలు అందజేయాలి: సోనియా గాంధీ
X

కరోనా మహమ్మారి వలన అన్ని వర్గాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజు వారి కూలీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి హామీ కార్మికులకు ముందస్తు వేతనాలు అందజేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసిన సోనియా గాంధీ.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కార్మికులకు పని లేదని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులకు కూడా వేతనాలు లేవని, వారికి ముందస్తు వేతనాలను మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది కూలీలున్నారని, వెంటనే వారికి 21 రోజుల వేతనాలను మంజూరు చేయాలని ప్రధాని మోదీని సోనియా గాంధీ లేఖలో ప్రస్తావించారు.

Next Story

RELATED STORIES