భక్తజనం లేకుండానే రాములోరి కల్యాణం

భద్రాచలంలో ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు భక్తులు లేకుండా ప్రారంభమయ్యాయి. ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జరుగుతోంది. ప్రభుత్వం తరుఫున తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు హాజరై స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.
భక్తులు ఎవ్వరూ హాజరు కాకుండా ఉండటానికి కారణం కరోనా వైరస్సే.. ఈ కారణంగా ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నెలకొంది. దాంతో భక్తులెవ్వరికి ఈ ఏడాది స్వామివారి కళ్యాణ్ తిలకించే భాగ్యం దక్కలేదు. ఏటా భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణం జరగుతోంది. వేదపండితులు, అర్చకులు, పోలీసు, సాధారణ అధికారులు, ఆలయ ప్రతినిధులు ఈ వేడుకకి హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com