బ్రదర్.. మీకు హాట్సాఫ్.. పారిశుద్య కార్మికులపై పూల వర్షం

బ్రదర్.. మీకు హాట్సాఫ్.. పారిశుద్య కార్మికులపై పూల వర్షం

చెత్తని మనమే రోడ్లమీద వేసి పైగా వాటిని క్లీన్ చేయలేదని ప్రభుత్వాన్ని, పారిశుద్య కార్మికులను తిడుతుంటాము. నిజానికి అదెంతో కష్టమైన పని.. అయినా వారికి అదే ఆధారం. కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దాదాపుగా జనం అంతా ఇళ్లలోనే గడుపుతున్నారు. అయినా ఇంట్లో చెత్తని బయటపడేయాలంటే పారిశుద్య కార్మికులు పని చేయాలి. అందుకోసం వారికి రోజు త్వరగా తెల్లవారి పోతుంది. ఉదయాన్నే బండ్లు, చీపుళ్లు పుచ్చుకుని తిరుగుతారు. వాళ్లంతా పని చేయబట్టే మన రోడ్డు బావుందని మనం ఎప్పుడూ మెచ్చుకోము. కానీ పటియాల ప్రజలు మాత్రం వారి సేవలకు గుర్తింపుగా పారిశుద్య కార్మికుల మీద పూల వర్షం కురింపించారు. కొన్ని అపార్ట్ మెంట్ వాసులు కిందికి వచ్చి వారి మెడలో డబ్బుల దండలు వేసి వారిపట్ల కృతజ్ఞత చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story