ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కరాళ నృత్యం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు రీచ్ అయింది. 51,000 మందికి పైగా మరణించారు, ఇటలీలో అత్యధిక మరణాలు సంభవించాయి, ఆ తరువాత స్థానంలో స్పెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయని.. 200,000 మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి నుండి కోలుకున్నారని కూడా బాల్టిమోర్ విశ్వవిద్యాలయం యొక్క సెంటర్ ఫర్ సిస్టమ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పేర్కొంది. స్పెయిన్లో కరోనావైరస్ మహమ్మారి మరణాల సంఖ్య గురువారం 10,000 దాటింది, అలాగే మొత్తం కేసులు 112,065 ఉన్నాయి.

గురువారం 1,000 కంటే ఎక్కువ మరణాలు సంభవించి మొత్తంగా 10,348 కు చేరుకుంది. అమెరికాలో మొదట్లో ఒక కేసుతో మొదలైన కరోనా రెండు లక్షల వరకూ రీచ్ అయింది. ఇక భారత్ లో వైరస్‌ ఇప్పటివరకూ 2,069 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. వైరస్‌ బారిన పడ్డ వారిలో 155 మంది కోలుకొని కొందరు డిశ్చార్జ్‌ అయినట్టు పేర్కొంది. ఇక ఈ వైరస్ భారిన పడి భారత్ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 53 మంది ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసింది.

Tags

Next Story