దేశంలో 410 జిల్లాలో కేంద్రం సర్వే

దేశంలో 410 జిల్లాలో కేంద్రం సర్వే

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు దేశ సన్నద్ధతపై మార్చి 25 నుంచి 30 మధ్య కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. దేశంలోని మొత్తం 410 జిల్లాల్లో సర్వే చేసింది. ఇందులో అనేక అంశాలపై సర్వే చేపట్టి ఓ అంచనాకు వచ్చింది. జిల్లా కలెక్టర్ల తోపాటు 2014 - 18 మధ్య ఐఏఎస్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సర్వే నిర్వహించారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. అలాగే ఏపీలో ఉన్న మూడు జిల్లాల్లో ఉన్న లోపాలను సర్వేలో ప్రస్తావించారు. ప్రకాశం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఉన్న లోటుపాట్లను కేంద్రం చేపట్టిన సర్వేలో ప్రస్తావించారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం, వారిని ఐసోలేషన్ కు పంపడం పెను సవాల్ గా మారిందని సర్వే పేర్కొంది. తెలంగాణ సరిహద్దు నుంచి కృష్ణా జిల్లాలోకి వచ్చిన విదేశీయులు, ఇతరులను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైనట్లు సర్వే పేర్కొంది. అలాగే విశాఖలో ప్రొటెక్టీవ్ గేర్స్ కొరతను సర్వే పేర్కొంది. అంటే ఏ మాత్రం రక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి లేదని తెలిపింది. లాక్ డౌన్ తరువాత ప్రకాశంజిల్లా వారు తిరిగి వెనక్కి వస్తుండటం పెద్ద సమస్యగా మారిందని సర్వే పేర్కొంది. ఇలా కేంద్రం నిర్వహించిన సర్వేలో ప్రకాశం. కృష్ణా, విశాఖలో ఉన్న లోపాలు బయటపడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story