హిమాచల్ ప్రదేశ్ లో క్రమంగా పెరుగుతోన్న కోవిడ్ కేసులు

హిమాచల్ ప్రదేశ్ లో క్రమంగా పెరుగుతోన్న కోవిడ్ కేసులు
X

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఓ మహిళ కోవిడ్ -19 కారణంగా మరణించారు. బడ్డీ ప్రాంతానికి చెందిన మహిళ కోవిడ్ -19 కారణంగా చండీగడ్ లోని పిజిఐఎంఆర్ ఆసుపత్రిలో మరణించినట్లు ఒక సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు. అయితే మహిళ కేసుకు సంబంధిన రిపోర్ట్ కాలేదని సోలన్ డిప్యూటీ కమిషనర్ కెసి చమన్ పిటిఐకి తెలిపారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య రెండుకు పెరిగింది.

మరోవైపు నిజాముద్దీన్ బెడద ఈ రాష్ట్రానికి కూడా తగిలింది. దాంతో రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకి పెరిగింది. గత నెలలో న్యూ ఢిల్లీలోని తబ్లిఘి జమాత్ సమాజానికి హాజరైన ముగ్గురు వ్యక్తులు హిమాచల్ ప్రదేశ్ కు వచ్చారు, వారికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే ఉన్న నాలుగు క్రియాశీల కోవిడ్ -19 కేసులు RPGMC వద్ద చికిత్స పొందుతున్నాయి. ఇక ముగ్గురు తబ్లిఘి జమాత్ తిరిగి వచ్చిన వారితో మరియు చండీగడ్ లోని పిజిఐఎంఆర్ వద్ద మరణించిన మహిళతో సంబంధాలు ఉన్న వ్యక్తులు గుర్తించబడ్డారని రాష్ట్ర ఆరోగ్య అధికారి తెలిపారు.

Next Story

RELATED STORIES