ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి

ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి
X

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. అనుప్ప‌ర్ జిల్లాలో గురువారం ఏనుగులు బీభ‌త్సం సృష్టించాయి. గ్రామంపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు. స‌మీప అడ‌వుల్లోంచి 12 ఏనుగులు ప‌ర్బా గ్రామం శివార్ల‌లోని పంట పొలాల్లోకి ప్ర‌వేశించాయి. ఒక్క‌సారిగా మీద‌కు దూసుకొస్తున్న‌ ఏనుగుల గుంపుని చూసి అక్క‌డే పొలాల్లో ప‌నిచేస్తున్న వారు ప‌రుగులు తీశారు. అయినా వారిలో ముగ్గ‌రిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఒక మ‌హిళ స‌హా ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. తీవ్రంగా గాయ‌ప‌డిన మ‌రో మ‌హిళ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Next Story

RELATED STORIES