హైకోర్ట్ మొట్టికాయలు వేసినా వెనక్కి తగ్గని జగన్ సర్కార్

హైకోర్ట్ మొట్టికాయలు వేసినా వెనక్కి తగ్గని జగన్ సర్కార్

రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణిపై హైకోర్టు మొట్టేక్కాయలు వేసినా జగన్ సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ఏకంగా crda మాస్టర్ ప్లాన్ లోని నిబంధనలనే మార్పులు చెయ్యాలని డిసైడ్ అయింది. ఆ మేరకు అడుగులు వేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని crda మాస్టర్ ప్లాన్ నిబంధనల్లో మార్పులు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం 1251 .51 ఎకరాలను కేటాయించేందుకు అవసరమైన ప్రక్రియల్ని కోర్టు ఆదేశాలకు లోబడి పూర్తి చెయ్యాలని crda ను ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో త్వరలో రాష్ట్ర స్ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన భూమిలో కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడం గ్రామాల పరిధిలోనే 1251 .51 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించేందుకు రెవెన్యూ విభాగానికి అప్పగించాల్సిందిగా crda ను ఆదేశిస్తూ ప్రభుత్వం ఫ్రిబ్రవరి 25 నే జిఓ నెంబర్ 107 జారీ చేసింది. ప్రభుత్వ జీవోను కొందరు రాజధానికి చెందిన రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో జీవో నెంబర్ 107 ను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ విభాగాన్ని ఒక దరఖాస్తు దారునిగా భావించి కేటాయింపులు జరపాలని పేర్కొంది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవసరమైన చర్యలన్నీ పూర్తి చేయాలనీ slp పై సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు, హైకోర్టు జారీ చేసే తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూడాలని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story