మీరు బయటకొస్తే.. నేను లోపలకొస్తా

మీరు బయటకొస్తే.. నేను లోపలకొస్తా
X

బయటకొస్తే కరోనా మిమ్మల్ని కాటేస్తుందని.. అల్లరి చేసే పిల్లల్ని అమ్మ ఇంట్లో బంధించినట్లు లాక్‌డౌన్ పేరుతో అందర్నీ ఇళ్లలోనే ఉండమని ప్రభుత్వం నెత్తీ నోరు మొత్తుకుంటోంది. అయినా ఏదో ఒక పేరుతో జనం బయట తిరుగుతూనే ఉన్నారు. వాళ్లని అరికట్టడానికి పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. కరోనాని కట్టడి చేద్దామనుకుంటే రోజు రోజుకి కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వాలను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట పోలీసులు ఒక బోర్డును ఏర్పాటు చేశారు. మీరు బయటకు వస్తే నేను లోపలికి వస్తా అని కరోనా చెబుతున్నట్లుగా ఉంది. వారి ప్రయత్నం అభినందనీయం. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ బోర్డు, స్లోగన్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 1 మిలియన్‌కు చేరుకుంది. 50,000 మందికి పైగా మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ లెక్కలు చెబుతున్నాయి. ఇక భారతదేశం విషయానికి వస్తే కోవిడ్ - 19 కేసుల సంఖ్య రెట్టింపు కాగా ఏప్రిల్ 2న 328 కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES