DIY మాస్క్‌లు వాడండి : కేంద్ర ఆరోగ్య శాఖ సూచన

DIY మాస్క్‌లు వాడండి : కేంద్ర ఆరోగ్య శాఖ సూచన

DIY మాస్క్‌లు విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచన చేసింది. ఇంట్లో( DIY (do it your ) ) తయారుచేసిన రక్షణ కవరును ఉపయోగించడంపై సలహా ఇచ్చింది. అనారోగ్య సమస్యలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు లేని వారు ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లను ఉపయోగించుకోవచ్చని సూచించింది. ప్రత్యేకించి వారు ఇంటి నుండి బయటకు అడుగుపెట్టినప్పుడు మాత్రమే ఈ మాస్కులను పెట్టుకోవాలని సూచించింది.

అయితే ఆరోగ్య కార్యకర్తలు, కరోనా బాధితులకు చికిత్స చేసే వారు వీటిని వాడాల్సిన అవసరం లేదని, వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మాస్క్‌లను మాత్రమే వినియోగించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ DIY మాస్కులను జాగ్రత్తగా వాడాలని.. ఒకరు ఉపయోగించిన మాస్కును మరొకరు ఉపయోగించకూడదని సూచించింది. ఇలా చేస్తే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story