కరోనాతో మరణించిన వారికి సంతాపం తెలిపిన చైనా

X
TV5 Telugu4 April 2020 2:32 PM GMT
కరోనా మహమ్మారికి బలైన చైనీయులకు.. ప్రభుత్వం ఆదేశాల మేరకు.. ఆ దేశ ప్రజలు సంతాపం తెలిపారు. శనివారం 10 గంటలకు 3 నిముషాలు పాటు మౌనం పాటించి అమరవీరులకు సంతాపం తెలిపారు.
ప్రాణాంతకమైన కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. చైనాలో మూడు వేల మందికి పైగా కరోనాతో మరణించారు. వైరస్ కారణంగా మరణించిన వారికి సంతాపసూచకంగా విమానాలు, బస్సులు, రైళ్లు, ఓడల్లో సైరన్ మోగించారు. దీంతో వీధిలో ఆగిపోయిందని AFP నివేదించింది.
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రాణాలను అర్పించిన డాక్టర్ లీ వెన్లీయాంగ్‌తో సహా అమరవీరులకు సంతాపం తెలిపారు. జాతీయ సంతాప దినోత్సవాన్ని జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రజా వినోద కార్యక్రమాలు నిలిపివేయబడ్డాయని చైనా అధికారిక మీడియా తెలిపింది.
Next Story