ఏపీలో 164 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఉదయం 10 నుంచి రాత్రి 10:30 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో, తూర్పు గోదావరి జిల్లాలో 2, విశాఖపట్నం లో ఒక పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి. దీంతో గురువారం రాత్రికి 149గా ఉన్న ఈ సంఖ్య శుక్రవారం మరో 15 కేసులతో 164కి పెరిగింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయినవారివే.
కాగా, పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా నెల్లూరులో 32 కేసులు నమోదు కాగా ఆ తరువాత 23కేసులు కృష్ణా జిల్లాలో, 20 కేసులు గుంటూరు జిల్లాలో నమోదు అయ్యాయి. కడపలో 19 , ప్రకాశంలో 17 , పశ్చిమ గోదావరిలో 15 , విశాఖలో 15 , తూర్పు గోదావరి 11 , చిత్తూరు 9 ,అనంతపురం 2, కర్నూల్ 1 కేసులు నమోదయ్యాయి. కాగా, కృష్ణా జిల్లా విజయవాడలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఢిల్లీ మత ప్రార్థనకు వెళ్లొచ్చిన యువకుడి నుంచి అతడి తండ్రికి కరోనా సోకడంతో ఆయన మృతి చెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com