కరోనా ఎఫెక్ట్ : ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ వాయిదా..

కరోనా ఎఫెక్ట్ : ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ వాయిదా..
X

కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ వాయిదా పడింది. ఈ మేరకు ఫుట్‌బాల్ ప్రపంచ పాలక మండలి శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు "ఫిఫా అండర్ -20 మహిళల ప్రపంచ కప్ పనామా / కోస్టా రికా 2020 ను కూడా వాయిదా వేయాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిఫా వర్కింగ్ గ్రూపులో సెక్రటరీ జనరల్స్ అలాగే అన్ని దేశాల నుండి ఉన్నతాధికారులు ఉన్నారు.

శుక్రవారం నిర్వహించిన మొదటి సమావేశం తరువాత వివిధ దేశాలు కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఫిఫా U-17 ను వాయిదా వేయాలని సిఫారసులు చేశారు. దాంతో వర్కింగ్ గ్రూపు ఈ సిఫారసులను ఏకగ్రీవంగా ఆమోదించింది. తద్వారా ఆటలను వాయిదా వేసింది. కాగా ఇక రీషెడ్యూల్ తేదీలను తరువాత ప్రకటించనుంది.

Next Story

RELATED STORIES