ఒడిశాలో ఒకేరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు

ఒడిశాలో ఒకేరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు

ఒడిశాలో శుక్రవారం పదిహేను మందికి COVID-19 కు పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20 కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఇందులో

10 కొత్త కేసులు భువనేశ్వర్ లో నమోదయ్యాయి, భద్రాక్ జిల్లాలో రెండు, కటక్, పూరి మరియు జాజ్పూర్లలో ఒక్కొక్క కేసు నమోదు అయింది. కొత్తగా.. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని సూర్యానగర్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. అతని తోపాటు భార్య, కుమార్తె మరియు అతని ఇంట్లో అద్దెకు ఉంటున్న మరో ఐదుగురికి కూడా పాజిటివ్ అని తేలింది. ఎయిమ్స్‌లో ఈ ఏడుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

దాంతో ఈ ప్రాంతాన్ని పోలీసులు సీల్ చేశారు. ఈ ప్రాంతంలోని అన్ని ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లను మూసి వేశారు. నివాసితులకు భువనేశ్వర్ మునిసిపల్ కార్పొరేషన్ అవసరమైన వస్తువులను అందిస్తుందని అధికారులు తెలిపారు. కొత్త కేసుల నేపథ్యంలో భారీ కాంటాక్ట్ ట్రేసింగ్ ఎక్సర్ సైజ్ ను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. సూర్యనగర్ ప్రాంతానికి చెందిన ఏడుగురు కొత్త రోగులకు ప్రయాణ చరిత్ర లేదని.. ఇతర కొత్త రోగుల ప్రయాణ వివరాలను ఇంకా నిర్ధారించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఇద్దరు COVID-19 రోగులు ఇప్పటివరకు కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story